ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

124 ఏళ్ల చరిత్రలో నాలుగోసారి.. శాంతి సమయంలో తొలిసారి!

ABN, First Publish Date - 2020-03-25T01:35:56+05:30

కరోనా మహమ్మారి దెబ్బకు మరో క్రీడ వాయిదా పడింది. ఈ మహమ్మారి దెబ్బకు పలు క్రీడా టోర్నీలు రద్దు కాగా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: కరోనా మహమ్మారి దెబ్బకు మరో క్రీడ వాయిదా పడింది. ఈ మహమ్మారి దెబ్బకు పలు క్రీడా టోర్నీలు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జూలై 24 నుంచి జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీటిని నిర్వహించే అవకాశం ఉంది. కాగా, 124 ఏళ్ల ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగో సారి.

  

1916లో బెర్లిన్, జర్మన్ ఎంపైర్‌లో ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా క్రీడలను తొలిసారి రద్దు చేశారు. ఆ తర్వాత 1940లో జపాన్ సమ్మర్, వింటర్ ఒలింపిక్స్ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు చేశారు వేశారు. 1944లో లండన్‌లో జరగాల్సిన క్రీడలను కూడా రెండో ప్రపంచ యుద్ధమే అడ్డుకుంది. తాజాగా, ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడింది. ఆఫ్ఘనిస్థాన్‌పై సోవియట్ యూనియన్ దాడిని నిరసిస్తూ 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికా, చైనా, జపాన్ దేశాలు బాయ్‌కాట్ చేశాయి. కాగా, ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉన్న సమయంలో ఒలింపిక్స్ వాయిదా పడడం ఇదే తొలిసారి. 

Updated Date - 2020-03-25T01:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising