ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకప్పుడు పాండవులు, సూరదాస్‌.. ఇప్పుడు తెవాటియా!

ABN, First Publish Date - 2020-09-30T09:32:41+05:30

ఒకప్పుడు పాండవులు, భక్త సూరదాస్‌.. ఇప్పుడు రాహుల్‌ తెవాటియా.. తమ ఊరికి గుర్తింపు తెచ్చారని ఆ గ్రామస్థులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊరి కుర్రాడి ఘనతపై ఆనందం

న్యూఢిల్లీ: ఒకప్పుడు పాండవులు, భక్త సూరదాస్‌.. ఇప్పుడు రాహుల్‌ తెవాటియా.. తమ ఊరికి గుర్తింపు తెచ్చారని ఆ గ్రామస్థులు సంబరపడిపోతున్నారు. ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో డైనమైట్‌లా పేలిన రాజస్థాన్‌ ఆటగాడు తెవాటియా రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. దీంతో హరియాణా, ఫరీదాబాద్‌లోని అతడి స్వగ్రామం సిహిలో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా తమ ఊరి కుర్రాడి గొప్పదనం గురించిన చర్చే నడుస్తోంది. ‘సిహి అంటే పాండవులు.. సూరదాస్‌.. ఇప్పుడు రాహుల్‌’ అని తెవాటియా తండ్రి కృష్ణ పాల్‌ కొడుకు గురించి గర్వంగా చెప్పుకుంటున్నాడు. 16వ శతాబ్దానికి చెందిన అంధ కవి సూరదాస్‌ ఈ గ్రామ వాస్తవ్యుడేనని ప్రతీతి. మహా భారతంలో పాండవులు అడిగిన ఐదు ఊళ్లలో సిహి గ్రామం కూడా ఒకటని పురాణాల ద్వారా తెలుస్తోందని పాల్‌ చెప్పాడు. ఇప్పుడు గ్రామ చరిత్రలో తెవాటియా పేరు కూడా చేరిందని చెప్పాడు. టీవీ చానళ్ల వాళ్లు కూడా రావడంతో తమ ఊరి పేరు దేశమంతా మార్మోగిపోతోందని ఆనందం వ్యక్తం చేశాడు.


Updated Date - 2020-09-30T09:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising