ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్ సభ్యులకూ క్రీడలపై అవగాహన లేదు: కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2020-07-12T01:39:00+05:30

భారత సమాజంలో క్రీడలపై అవగాహన తక్కువేనని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెణ్ రిజీజూ అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత సమాజంలో క్రీడలపై అవగాహన తక్కువేనని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెణ్ రిజీజూ అభిప్రాయపడ్డారు.‘నా తోటివారిని తక్కువ చేయాలని కాదు కానీ పార్లమెంటు సభ్యుల్లోనూ క్రీడలపై అవగాహన లేదు. క్రికెట్ గురించి మాత్రం అందరికీ తెలుసు. బ్రిటీష్ వాళ్లు దాన్ని మన మెదళ్లలో పెట్టి పోయారు. అది తప్ప, ఇతర విషయాల్లో అవగాహన అస్సలు లేదు. కానీ బంగారు పతకాలు కావాలని మాత్రం అందరూ కోరుకుంటారు’ అంటూ ఆయన సూటి వ్యాఖ్యలు చేశారు.


ఇటీవల వార్తల్లో నిలిచిన జోత్యి కుమారి అనే బాలిక దేశానికి బంగారు పతాకాలు తేగలదంటూ కొందరు చేస్తున్న వాదన పట్ల కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘జ్యోతి కుమారి అనే 15 ఏళ్ల బాలిక అనారోగ్యంతో తన తండ్రిని  వెనకు కూర్చో పెట్టుకుని 1200 కీమీల పాటు సైకిల్ తొక్కింది. గురుగ్రామ్‌ నుంచి బీహార్ వరకూ ఏకంగా 8 రోజుల పాటు సైకిల్ తొక్కింది. లాక్ డౌన్ కారణంగా మరో దారి లేని స్థితిలో ఈ ప్రయాణానికి పూనుకుంది. అయితే ఇది ఓ విచారకరమైన ఘటన. కానీ నా తొటివారిలో కొంత మంది మాత్రం ఆమె భారత్‌కు బంగారు పతకాలు తేగలదని వ్యాఖ్యానించారు. ఆటల పట్ల అవగాహన లేకపోతే ఇలాంటి ఆలోచనలే వస్తాయి’ అని ఆయన కామెంట్ చేశారు. 

Updated Date - 2020-07-12T01:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising