అలనాటి జెర్సీలో టీమిండియా?
ABN, First Publish Date - 2020-11-13T09:39:26+05:30
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ల్లో టీమిండియా ‘రెట్రో’ జెర్సీలో కనిపించనుందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ల్లో టీమిండియా ‘రెట్రో’ జెర్సీలో కనిపించనుందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నీలి రంగు జెర్సీల స్థానంలో నేవీ బ్లూ కిట్‌లను కోహ్లీ అండ్ కో ధరించనున్నట్టు సమాచారం. ఈ కొత్త జెర్సీని.. 1992 వరల్డ్‌కప్‌లో భారత జట్టు వేసుకున్న కిట్‌లతో పోల్చుతూ నెటిజన్లు కొన్ని ఫొటోలను కూడా పోస్టు చేశారు. బీసీసీఐ మాత్రం నూతన కిట్‌లపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.
Updated Date - 2020-11-13T09:39:26+05:30 IST