ఒక్కో మ్యాచ్‌కు రూ. 65 లక్షలు
ABN, First Publish Date - 2020-11-03T09:11:11+05:30
టీమిండియా కిట్ స్పాన్సర్‌షిప్ హక్కులను మొబైల్ ప్రీమియర్ లీగ్‌కు చెందిన ‘ఎంపీఎల్ స్పోర్ట్ అపారెల్, యాక్ససరీస్’ దక్కించుకొంది. నైక్ సంస్థ
టీమిండియా కిట్ స్పాన్సరర్‌గా ‘ఎంపీఎల్ స్పోర్ట్స్’
రహస్య డీల్ అంటూ ప్రత్యర్థి కంపెనీల ఆరోపణ
న్యూఢిల్లీ: టీమిండియా కిట్ స్పాన్సర్‌షిప్ హక్కులను మొబైల్ ప్రీమియర్ లీగ్‌కు చెందిన ‘ఎంపీఎల్ స్పోర్ట్ అపారెల్, యాక్ససరీస్’ దక్కించుకొంది. నైక్ సంస్థ స్థానంలో మూడేళ్లపాటు కిట్ స్పాన్సరర్‌గా ఎంపీఎల్‌తో బీసీసీఐ ఒప్పందం ఖరారు చేసుకున్నట్టు అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు సోమవారం తెలిపారు. అయితే, గతంలో కంటే రూ. 23 లక్షలు తక్కువకే ఈ డీల్ కుదిరింది. ‘భారత పురుషులు, మహిళలు, ఎ, అండర్-19 జట్ల అపారెల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందానికి అపెక్స్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. అయితే, గత ఒప్పందంలో నైక్ ఒక్కో మ్యాచ్‌కు రూ. 88 లక్షలు చెల్లించింది. కానీ, నూతన ఒప్పందంలో మ్యాచ్‌కు రూ. 65 లక్షలు మాత్రమే గిట్టుబాటు కానున్నాయి. ఈ డీల్ 2023 నవంబరు వరకు కొనసాగనుంది’ అని బోర్డు అధికారి తెలిపారు. ఈ డీల్ కింద విక్రయాల్లో బీసీసీఐకి అదనంగా 10 శాతం రాయల్టీ దక్కనున్నట్టు తెలుస్తోంది. 2016 నుంచి ఐదేళ్లపాటు ఒప్పందానికి నైక్ రూ. 30 కోట్ల రాయల్టీ సహా రూ. 370 కోట్లు చెల్లించింది. ఐపీఎల్‌లో కోల్‌కతా, బెంగళూరుకు ఎంపీఎల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. అయితే, చడీచప్పుడు కాకుం డా డీల్ కుదుర్చుకోవడంపై పోటీ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నైక్‌తో ఒప్పందకాలం ముగియకముందే బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. కానీ, బిడ్లు కొన్న ప్యూమా, అడిడాస్ కంపెనీలు సెప్టెంబరు 1 నాటికి డెడ్‌లైన్ ముగిసినా.. వాటిని దాఖలు చేయలేదు. దీంతో గడువు తేదీని పొడిగిస్తారని అంతా భావించారు. బిడ్లు ఖరీదు చేసిన సంస్థలతో బీసీసీఐ చర్చించి ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, బోర్డు మాత్రం షరతులను ఏమాత్రం సడలించలేదు. ఇప్పుడు మాత్రం బిడ్‌లో పేర్కొన్న అర్హతలను తుంగలోకి తొక్కి ఎంపీఎల్‌తో బీసీసీఐ డీల్ కుదుర్చుకుందనే విమర్శలులు వినిపిస్తున్నాయి.
Updated Date - 2020-11-03T09:11:11+05:30 IST