ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

ABN, First Publish Date - 2020-02-08T12:47:10+05:30

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని రుచి చూసిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. సిరీస్ ఆశలు సజీవం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు టీ-20 సిరీస్‌ని కోల్పోయిన ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారగ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రాబోయే టెస్ట్ సిరీస్‌ని దృష్టిలో పెట్టుకొని మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో నవ్‌దీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజవేంద్ర చాహల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా జట్టులో రెండు మార్పులు చేసింది. మిషెల్ శాంట్నర్ స్థానంలో మార్క్ ఛాంప్‌మాన్ జట్టులోకి వచ్చాడు. ఇష్ సోథీ జట్టు నుంచి బయటకు వెళ్లగా కైల్ జెమీసన్‌ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి ఆరంగేట్రం చేస్తున్నాడు. 


జట్ల వివరాలు: 


భారత్: పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, యుజవేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.


న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, హెర్నీ నికోలస్, టామ్ బ్లండెల్, రాస్ టేలర్, టామ్ లాథమ్(కెప్టెన్/కీపర్), మార్క్ ఛాంప్‌మాన్, జేమ్స్ నీశమ్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జెమీసన్‌, టిమ్ సౌతీ, హామిశ్ బెన్నెట్ట్.

Updated Date - 2020-02-08T12:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising