ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. హార్థిక్ పాండ్యా కూడా..

ABN, First Publish Date - 2020-11-27T22:51:43+05:30

సిడ్నీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆరవ వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆరవ వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ.. హార్థిక్ పాండ్యా, ధావన్ చెప్పుకోదగిన భాగస్వామ్యంతో ఆడి టీమిండియా గెలుపుపై ఆశలు రేపారు. అయితే.. జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌గా చిక్కి ధావన్ ఔట్ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశ చెందారు. ధావన్ 86 బంతుల్లో 10 ఫోర్లతో 74 పరుగులతో రాణించాడు. హార్థిక్ పాండ్యా కూడా అవకాశం దొరికినప్పుడ్లలా సిక్స్‌లు, ఫోర్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పాండ్యా 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు.


వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసే అవకాశం పాండ్యాకు 10 పరుగుల దూరంలో చేజారింది. 76 బంతుల్లో 4 సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 90 పరుగులు చేసిన పాండ్యా ఆటతీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నవదీప్ సైనీ, జడేజా క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడితే తప్ప టీమిండియాకు ఈ మ్యాచ్‌లో విజయం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మయాంక్ అగర్వాల్(22), విరాట్ కోహ్లీ(21), శ్రేయాస్ అయ్యర్(2), కేఎల్ రాహుల్(12) పరుగులకే ఔట్ కావడంతో టీమిండియా 101 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడింది.

Updated Date - 2020-11-27T22:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising