ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాల సెగ

ABN, First Publish Date - 2020-07-06T08:53:08+05:30

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తాకింది. ఒకేసారి రెండు వ్యాపార సంస్థల్లో అతడు కీలక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తాకింది. ఒకేసారి రెండు వ్యాపార సంస్థల్లో అతడు కీలక స్థానాల్లో ఉన్నాడంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఆరోపించాడు.  ఈ మేరకు అతను బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి, అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌కు ఫిర్యాదు చేశాడు. లోధా కమిటీ సంస్కరణల్లో భాగంగా ప్రస్తుత ఆటగాళ్లు, సెలెక్టర్లు, కామెంటేటర్లు, ఆఫీస్‌ బేరర్లు, మ్యాచ్‌ అధికారులు ఏకకాలంలో రెండు పదవుల్లో కొనసాగడానికి వీల్లేకుండా గతంలోనే బీసీసీఐ రాజ్యాంగ సవరణ చేసింది. అయితే విరాట్‌ కోహ్లీ స్పోర్ట్స్‌, కార్నర్‌స్టోన్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌లలో కోహ్లీ కో-డైరెక్టర్‌గా ఉండడంతో పాటు కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిడెడ్‌లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడని గుప్తా తెలిపాడు. ఇందులో కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ అనేది భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌లతో పాటు వారి బ్రాండింగ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుందని ఆరోపించాడు. ‘ఒకేసారి రెండు పదవులు అనుభవిస్తూ బీసీసీఐ నిబంధన 38 (4)ను కోహ్లీ అతిక్రమించాడు’ అని గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒకవేళ విరాట్‌కు విరుద్ధ ప్రయోజనాలుంటే నోటీసులిస్తామని అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ అన్నారు. 

Updated Date - 2020-07-06T08:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising