ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి టీ20లో శివం దూబే చెత్త రికార్డు

ABN, First Publish Date - 2020-02-02T23:42:57+05:30

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా మీడియం పేసర్ శివం దూబే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మౌంట్‌ మాంగనుయ్: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా మీడియం పేసర్ శివం దూబే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దూబే వేసిన పదో ఓవర్‌లో కివీస్ ఆటగాళ్లు రాస్‌టేలర్, సీఫెర్ట్‌లు ఇద్దరూ పరుగుల ప్రవాహం సృష్టించారు. ఈ ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు పిండుకున్నారు.


దూబే వేసిన తొలి బంతిని మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టిన సీఫెర్ట్.. తర్వాతి బంతిని డీప్ స్క్వేర్ మీదుగా స్టాండ్స్‌కు పంపాడు. మూడో బంతిని కీపర్ పక్క నుంచి బౌండరీకి పంపి, నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దూబే వేసిన ఐదో బంతిని టేలర్ ఎదుర్కొన్నాడు. నోబాల్ అయిన ఆ బంతి నేరుగా బౌండరీకి చేరింది. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో అదనంగా వేసిన బంతిని టేలర్ ఆఫ్ స్టంప్ మీదుగా సిక్సర్ బాదాడు. ఇక, చివరి బంతిని డీప్ స్క్వేర్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపడంతో ఆ ఓవర్‌లో కివీస్‌కు ఏకంగా 34 పరుగులు వచ్చాయి. టీ20ల్లో ఓ బౌలర్ అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఇది రెండోసారి. 


2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రాడ్ వేసిన ఆరు బంతులనూ సిక్సర్లుగా మలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. బ్రాడ్ 36 పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును తన పేరుపై రాసుకున్నాడు.


తాజా మ్యాచ్‌లో 34 పరుగులిచ్చిన దూబే అతడి  తర్వాతి స్థానంలో నిలిచాడు.  ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా బౌలర్ డబ్ల్యూ పార్నెల్(32), ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ఐ దౌలత్ జాయ్ (32), భారత బౌలర్ ఎస్ బిన్నీ (32), నెదర్లాండ్స్ బౌలర్ ఎం ఓ దౌద్ (32), బంగ్లాదేశ్ బౌలర్ ఎం సైఫుద్దీన్ (31) ఉన్నారు.  

Updated Date - 2020-02-02T23:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising