ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాట్స్‌మెన్‌ను బంతితో కొట్టిన బౌలర్.. 5 పరుగులిచ్చిన అంపైర్!

ABN, First Publish Date - 2020-08-03T04:03:59+05:30

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ బౌలర్ తనవైపు వచ్చిన బంతిని బ్యాట్స్‌మెన్ వైపు బలంగా విసిరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాంకన్‌షైర్: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ బౌలర్ తనవైపు వచ్చిన బంతిని బ్యాట్స్‌మెన్ వైపు బలంగా విసిరాడు. వేగంగా దూసుకెళ్లిన ఆ బంతి బ్యాట్స్‌మెన్‌కు తగిలింది. దీన్ని తప్పుబట్టిన అంపైర్ బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు అదనంగా జతచేశాడు. ఈ ఘటన ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో జరిగింది. బాబ్ విల్లీస్ ట్రోఫీలో భాగంగా లాంకన్‌షైర్, లీసెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా లీసెస్టర్‌షైర్ జట్టు సభ్యుడు డీటర్ క్లెయిన్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పడు బ్యాటింగ్ చేస్తున్న డ్యానీ లాంబ్ స్ట్రయిట్ షాట్ ఆడాడు. తనవైపే వచ్చిన బంతిని వెంటనే అందుకున్న డీటర్.. డ్యానీ వైపు బలంగా బంతిని విసిరాడు . అది డ్యానీకి తగిలింది. దీన్ని చూసిన అంపైర్ అది ప్రమాదకరమైన త్రో అని, నేరుగా బ్యాట్స్‌మెన్‌కు తగిలిందని డీటర్‌ను మందలించాడు. ఆ తర్వాత లాంకన్‌షైర్ జట్టుకు అదనంగా 5 పెనాల్టీ పరుగులు జతచేస్తున్నట్లు ప్రకటించాడు.

Updated Date - 2020-08-03T04:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising