ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ కెరీర్‌పై టీం ఇండియా మాజీ కీపర్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-05-30T18:17:30+05:30

2019 ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగే ఇండియన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2019 ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అయినా అతను పాల్గొంటాడని అంతా భావించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లీగ్ తాత్కాలికంగా రద్దు కావడంతో.. అదీ జరుగలేదు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్‌మెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. ధోనీ కెరీర్ ఇక ముగిసినట్లే అని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. తాజాగా ధోనీ కెరీర్‌ గురించి 1983 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో కీపర్ సైయద్ కిర్మాణి కామెంట్ చేశారు. ధోనీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. 


‘‘ధోనీకి ఇప్పటివరకూ తన భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రకటన చేయలేదు. అతనికి మళ్లీ జట్టులో చోటు దక్కుతుందని నాకు అనిపించడం లేదు. ధోనీ సాధించాల్సింది అంతా ఇప్పటికే సాధించాడు. ఇంకా అతను సాధించాల్సింది ఏదీ లేదు. తుది నిర్ణయం అతనిదే. ఈ ఏడాది ఐపీఎల్ కూడా అతనికి చివరిది అవుతుంది’’ అని కిర్మాణి పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-30T18:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising