ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువరాజ్ సింగ్ వ్యాఖ్యాలపై స్పందించిన సురేశ్ రైనా

ABN, First Publish Date - 2020-05-26T23:42:08+05:30

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ కొద్ది రోజుల క్రితం భారత కెప్టెన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీ నుంచి తనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ కొద్ది రోజుల క్రితం భారత కెప్టెన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీ నుంచి తనకు లభించినంత మద్దతు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ నుంచి తనకు లభించలేదని యువీ అన్నాడు. అంతేకాక.. ఎంఎస్ ధోనీకి సురేశ్ రైనా అభిమాన ఆటగాడని.. అందుకే అతనికి ఎక్కువ అవకాశాలు ఇచ్చాడని యువీ పేర్కొన్నాడు. 


అయితే ఈ వ్యాఖ్యలపై సురేశ్ రైనా స్పందించాడు. తను ధోనీకి.. అభిమాన ఆటగాడు కాదని.. కెప్టెన్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న సత్తా తనలో ఉంది కాబట్టే తనకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని అతను అన్నాడు. ‘‘అవును ఎంఎస్ ధోనీ నాకు మద్దతు ఇచ్చాడు.. ఎందుకంటే నాలో టాలెంట్ ఉందని తనకు తెలుసు. ధోనీకి నాపై నమ్మకం ఉంది. అది సీఎస్‌కేలో అయినా.. అది టీం ఇండియాలో అయినా. ఇక మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఒక్కొసారి 10 ఓవర్లే ఆడాలి.. ఒక్కసారి 30 ఓవర్లు ఆడాలి. మా స్థానం వేరుగా ఉంటుంది. వికెట్లు తీయాలి.. లేదా 15-20 రన్లు కాపాడాలి. మిడిలార్డర్ నాకు ఎప్పుడు సవాలుగానే ఉంటుంది. కానీ, నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నాను’’ అని రైనా అన్నాడు. 

Updated Date - 2020-05-26T23:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising