ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ గురించి అప్పుడు ఆలోచిద్దాం: సురేశ్ రైనా

ABN, First Publish Date - 2020-04-04T02:42:56+05:30

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లక్షలాదిమంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని, ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  లక్షలాదిమంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని, ఈ సమయంలో ఐపీఎల్ గురించి ఆలోచించడం తగదని టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చినప్పుడు ఐపీఎల్ గురించి ఆలోచిద్దామని అన్నాడు. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా సురేశ్ రైనా రూ. 52 లక్షల విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ ఈ నెల 15కు వాయిదా పడినప్పటికీ, సమీప భవిష్యత్తులో అది జరిగే అవకాశాలు కనిపించడం లేదని అన్నాడు.


ప్రస్తుతానికైతే ప్రాణాలకు మించిన ముఖ్యమైన విషయం మరోటి లేదని రైనా పేర్కొన్నాడు. ఈ మహమ్మారి బారినపడి ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైనా.. మనం వారి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుత పరిస్థితులను ఎదురొడ్డేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని రైనా కోరాడు. పరిస్థితులు కుదటపడి, సాధారణ స్థితికి చేరుకునేంత వరకు ఐపీఎల్ కోసం వేచి చూడక తప్పదని రైనా స్పష్టం చేశాడు.

Updated Date - 2020-04-04T02:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising