ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ ఛేజ్ చేసే విధానానికి నేను అభిమానిని: స్టీవ్ స్మిత్

ABN, First Publish Date - 2020-06-02T00:47:47+05:30

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఈ తరానికి చెందిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరు ఇప్పటికే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఈ తరానికి చెందిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరు ఇప్పటికే తమ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించారు. ఓ వైపు కోహ్లీ వన్డేల్లో నెం.1 ర్యాంకులో ఉంటే.. మరోవైప టెస్టుల్లో నెం.1 ర్యాంకులో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అయితే కోహ్లీ, స్మిత్‌లలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు మాజీలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే కోహ్లీతో తనని పోల్చడం సరికాదని స్మిత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 


విరాట్ అంటే తనకు ఎంతో గౌరవమని.. ముఖ్యంగా అతను ఛేజింగ్ చేసే విధానానికి తాను అభిమాని అని స్మిత్ తెలిపాడు. ‘‘విరాట్ అంటే నాకు చాలా గౌరవం. అతను అద్భుతమైన ఆటగాడు. అసాధ్యమైన రికార్డులు అతను సాధించాడు. అతను ఇండియా కోసం ఎంతో చేశాడు. భారత జట్టు ఇప్పుడు ఆడుతున్న విధానం వెనుక విరాట్ కోహ్లీ తపన ఎంతో ఉంది’’ అని స్మిత్ అన్నాడు. 


విరాట్ కోహ్లీ ఎంతో పట్టుదల ఉన్న వ్యక్తి అని.. ఎంతో కష్టపడి తన శరీరాన్ని ఫిట్‌గా మార్చుకున్నాడని.. స్మిత్ పేర్కొన్నాడు. ‘‘విరాట్ ఫిట్ మరియు బలవంతమైన వ్యక్తి. క్రికెటె్‌కి అతను అందం తీసుకొచ్చాడు. ముఖ్యంగా వైట్-బాల్ క్రికెట్‌లో అతను ఛేజింగ్ చేసే విధానానికి నేను అభిమానిని. వన్డేల్లో అతని యావరేజ్ అత్యద్భుతం. ఎంత ఒత్తిడిలో అయినా.. ప్రశాంతంగా ఉంటూ తనకు కావాల్సింది సాధిస్తాడు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి’’ అని స్మిత్ అన్నాడు. 

Updated Date - 2020-06-02T00:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising