ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నో టచ్‌

ABN, First Publish Date - 2020-05-20T09:41:38+05:30

దాదాపు మూడు నెలలుగా దేశవ్యాప్తంగా స్తంభించిన అన్ని కార్యకలాపాలు నెమ్మదిగా ఆరంభవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాకీ బంతిని తాకొద్దు 

సహచరులతో సంబరాలు వద్దు

జాతీయ క్రీడ పునరాగమనానికి 

ఎఫ్‌ఐహెచ్‌ గైడ్‌లైన్స్‌

 

 న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలలుగా దేశవ్యాప్తంగా స్తంభించిన అన్ని కార్యకలాపాలు నెమ్మదిగా ఆరంభవుతున్నాయి. నాలుగో విడత లాక్‌డౌన్‌లో కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో ఇప్పుడంతటా మునుపటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే క్రమంలో స్టేడియాలను వినియోగించుకునేందుకు కూడా సడలింపు ఇవ్వడంతో క్రీడల్లోనూ కదలిక కనిపిస్తోంది. విశ్వవ్యాప్తంగా ఇప్పటికే జర్మనీలో బుండెస్లిగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. ఈనేపథ్యంలో నరీందర్‌ బాత్రా నేతృత్వంలోని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) కూడా ఇక నుంచి హాకీ ఆడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ 12 మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే స్థానిక చట్టాలను అనుసరిస్తూ కాంటినెంటల్‌ ఫెడరేషన్లు, జాతీయ సంఘాలు, క్లబ్బులు వీటిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి  లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలల నుంచి హాకీ ఆటగాళ్లంతా బెంగళూరులోని సాయ్‌ సెంటర్‌లోనే ఉంటున్నారు. కానీ ఇన్నాళ్లుగా శిక్షణకు వీలు లేకపోవడంతో క్వారంటైన్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇక తమ ప్రాక్టీస్‌ కోసం సాయ్‌ నుంచి తుది అనుమతి కోసం వేచిచూస్తున్నారు. మరోవైపు విదేశాల్లో శిక్షణ శిబిరాలను క్రీడా శాఖ నిషేధించడంతో దాదాపుగా అన్ని క్రీడలకూ ఎఫ్‌ఐహెచ్‌ సూచించిన మార్గదర్శకాలు ఆదర్శంగా మారే అవకాశం ఉంది.


హాకీ.. టెకీ..!

వర్కవుట్లలో భౌతిక దూరం పాటించడం కోసం అందరూ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. ఇందుకోసం కోచింగ్‌ సిబ్బంది ఉపయోగించే అప్లికేషన్లను అథ్లెట్లు కూడా వాడుతున్నారు. రోజువారీ వర్కవుట్ల డేటాను ఆన్‌లైన్‌ అప్లికేషన్ల ద్వారా దాఖలు చేస్తున్నారు. ‘వారం షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసి వాటిని షేర్‌ చేయడానికి ఈ అప్లికేషన్లను కోచింగ్‌ సిబ్బంది ఉపయోగించే వారు. కానీ, కరోనా కారణంగా సాయ్‌లో భౌతిక దూరం తప్పనిసరైంది. దీంతో ప్రతీరోజూ ఏం చేశామనేది అప్‌లోడ్‌ చేయడం తప్పని సరైంది. వెల్‌నెస్‌ డేటాను గూగుల్‌ డాక్యుమెంట్స్‌తో, ట్రైనింగ్‌కు సంబంధించిన వాటిని గూగుల్‌ ఫామ్స్‌తో దాఖలు చేస్తున్నామ’ని మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ సవిత చెప్పింది. ఇక కోచ్‌లతో మాట్లాడడానికి జూమ్‌ లేదా గూగుల్‌ మీట్‌ అనివార్యమైందని తెలిపింది. సహచరులతో కూడా ఆన్‌లైన్‌లోనే మాట్లాడుతున్నామని పురుషుల జట్టు వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పాడు. డైట్‌, వ్యూహాల గురించి కూడా నెట్‌లోనే చర్చిస్తున్నట్టు వివరించాడు. లాక్‌డౌన్‌లో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో అందరూ నేర్చుకున్నారని అన్నాడు.


ఇవీ రూల్స్‌ ..

ఆయా ప్రభుత్వాల నిబంధనలు, గైడ్‌లైన్స్‌ను గౌరవించాలి. కరోనా లక్షణాలున్న ఆటగాళ్లను శిక్షణకు అనుమతించరాదు.

ప్రతీ ఒక్కరూ శిక్షణ కోసం నడుచుకుంటూ లేదా సొంత వాహనాల్లో మాత్రమే రావాలి. శిక్షణకు కాస్త ముందుగానే హాజరుకావాలి.


అన్ని విషయాల్లోనూ సూచనలను పాటించడం తప్పనిసరి.


ఆటగాళ్ల మధ్య కనీసం 1.5మీ. దూరాన్ని విధిగా పాటించాల్సిందే.


 చేతులతో బంతిని తాకరాదు.


సహచరులతో సంబరాలు చేసుకోవడం.. హైఫైవ్‌ ఇచ్చుకోవడం కుదరదు.


శిక్షణకు ముందు, తర్వాత చేతులను శానిటైజ్‌  చేసుకోవాలి.


మౌత్‌గార్డ్‌ను చేతితో తాకడం, అందులోంచి ఉమ్మడం చేయకూడదు.


ప్రతీ ఆటగాడు నీళ్ల బాటిల్‌ను వెంట తెచ్చుకోవాలి.


ఎవరి హాకీ స్టిక్‌, ప్యాడ్స్‌ వారే తెచ్చుకోవాలి.


ట్రైనింగ్‌ సెషన్‌ ముగిశాక నేరుగా ఇంటికి లేదా హాస్టల్‌కు మాత్రమే వెళ్లాలి. వీటితో పాటు ఎఫ్‌ఐహెచ్‌ నాలుగు దశలను కూడా సిఫారసు చేసింది.


ఒకటో దశ: వ్యక్తిగత శిక్షణ

రెండో దశ: శరీరాలను తాకకుండా చిన్న సమూహాలతో శిక్షణ

మూడో దశ: శరీరాలను తాకుతూ చిన్న సమూహాలతో శిక్షణ

నాలుగో దశ: మొత్తం జట్టుగా శిక్షణ

Updated Date - 2020-05-20T09:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising