ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌతాఫ్రికా జట్టుకు భారీ జరిమానా విధించిన ఐసీసీ

ABN, First Publish Date - 2020-02-23T00:19:43+05:30

ఆస్ట్రేలియాతో వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20లో స్లో ఓవర్ రేటు కారణంగా సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహెన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20లో స్లో ఓవర్ రేటు కారణంగా సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. క్వింటన్ డికాక్ జట్టు నిర్ణీత సమయం కంటే ఒక ఓవర్ ఆలస్యంగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ రెఫరీ ఆండ్రూ పైక్రాఫ్ట్ గుర్తించారు. దీన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఆడ్రియాన్ హోల్డ్‌స్టాక్, అలాహుద్దీన్ పాలేకర్, థర్డ్ అంపైర్ బొంగాని జెలే మరియు ఫోర్త్ అంపైర్ బ్రాడ్ వైట్ నిర్ధారించారు. దీంతో సౌతాఫ్రికా జట్టు సభ్యుల మ్యాు ఫీజు నుంచి 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 


అయితే తమ జట్టుకు విధించిన శిక్షను అంగీకరిస్తున్నట్లు డికాక్ పేర్కొన్నారు. దీంతో అతను విచారణకు హాజరుకావాల్సిన పని లేకుండా పోయింది. 


కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆష్టన్ అగర్ హ్యాట్రిక్ సాధించడంతో ఆసీస్ ఈ మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Updated Date - 2020-02-23T00:19:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising