ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జెంటుగా పాకిస్థాన్ బయలుదేరిన షాహిద్ అఫ్రిది

ABN, First Publish Date - 2020-12-04T00:20:52+05:30

లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో ఆడుతున్న పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అత్యవసర వ్యక్తిగత పని నిమిత్తమై పాకిస్థాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో ఆడుతున్న పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అత్యవసర వ్యక్తిగత పని నిమిత్తమై పాకిస్థాన్ వెళ్లనున్నాడు. అక్కడ పని పూర్తయిన వెంటనే తిరిగి శ్రీలంక చేరుకుంటాడు. ‘‘దురదృష్టవశాత్తు నేను వ్యక్తిగత పనిపై అత్యవసరంగా ఇంటికి వెళ్లాల్సి ఉంది. అక్కడ పరిస్థితి కొలిక్కి వచ్చిన వెంటనే తిరిగి ఎల్‌పీఎల్‌లో చేరుతా. ఆల్ ది బెస్ట్’’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు గత నెల 24న అతడు శ్రీలంక చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత నిర్వహించిన కరోనా పరీక్షల్లో యాంటీబాడీలు ఉన్నట్టు తేలడంతో 27న మైదానంలో అడుగుపెట్టాడు. అఫ్రిది సారథ్యంలోని గాలె గ్లాడియేటర్స్ ఎల్‌పీఎల్‌లో ఇంకా బోణీ కొట్టలేదు. ఇప్పుడు అఫ్రిది దూరమడంతో జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు. అఫ్రిది గైర్హాజరీలో వైస్ కెప్టెన్ భనుక రాజపక్ష కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ నెల 26న ఎల్‌పీఎల్ ఫైనల్ జరగనుంది. 

 

Updated Date - 2020-12-04T00:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising