ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్ 7వ క్రికెటరుకు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-11-28T14:49:49+05:30

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరో క్రికెటరుకు కరోనా వైరస్ సోకిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్‌టన్ (న్యూజిలాండ్): పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరో క్రికెటరుకు కరోనా వైరస్ సోకిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడవ పాకిస్థాన్ క్రికెటరుకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో శనివారం క్రైస్ట్ చర్చ్ లోని తన హోటల్ గదికే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ కు వచ్చిన పాకిస్థాన్ జట్టు సభ్యులకు కరోనా పాజిటవ్ అని తేలడంతో వారు రెండు వారాల పాటు నిర్బంధంలో గడపాలి. పాక్ క్రికెట్ జట్టు హోటల్ లో సామాజిక దూరం పాటిస్తూ నిర్బంధంలో ఉండాలని న్యూజిలాండ్ వైద్యాధికారులు కోరారు. కరోనా సోకిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు సభ్యులు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, దీన్ని తీవ్రంగా పరిగణించిన తాము పాక్ జట్టుకు తుది హెచ్చరిక జారీ చేశామని న్యూజిలాండ్ వైద్యఆరోగ్యశాఖ డైరెక్టరు జనరల్ యాష్లే బ్లూమ్పీల్డ్ చెప్పారు. గతంలో న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ జట్టులో మాజీ కెప్టెన్‌ సర్ఫ్‌రాజ్‌ సహా ఆరుగురు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో వీరిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈనెల 24న పాక్‌ జట్టు న్యూజిలాండ్ దేశంలో అడుగుపెట్టింది. వచ్చేనెల 18 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ఆ తర్వాత రెండు టెస్టులు ఆడనుంది.

Updated Date - 2020-11-28T14:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising