ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యో.. సెరెనా!

ABN, First Publish Date - 2020-10-01T09:32:03+05:30

మార్గరెట్‌ కోర్ట్‌ 24 సింగిల్స్‌ టైటిళ్ల ఆల్‌టైమ్‌ రికార్డు కోసం ఎదురుచూస్తున్న దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు మరోసారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాయంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి అవుట్‌

పారిస్‌: మార్గరెట్‌ కోర్ట్‌ 24 సింగిల్స్‌ టైటిళ్ల ఆల్‌టైమ్‌ రికార్డు కోసం ఎదురుచూస్తున్న దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. తల్లయ్యాక రెండేళ్ల క్రితం టెన్ని్‌సలో పునరాగమనం చేసినప్పటినుంచి ఆ రికార్డును అందుకోవాలని ఆరాటపడుతున్న 39 ఏళ్ల సెరెనాకు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గాయం రూపంలో అడ్డంకి ఎదురైంది. ఎడమ కాలి మడమ గాయం తిరగబెట్టడంతో ఏకంగా టోర్నీ నుంచే వైదొలుగుతున్నట్టు ఆమె బుధవారం ప్రకటించింది. బల్గేరియాకు చెందిన స్వెటానా పిరొంకోవాతో రెండో రౌండ్‌ మ్యాచ్‌కు ముందు సెరెనా ఈ నిర్ణయం తీసుకుంది. గాయంతో నడవడానికి కూడా ఇబ్బందిపడుతున్నట్టు ఆమె వెల్లడించింది. మూడువారాల కిందట యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ సందర్భంగా సెరెనాకు ఈ గాయమైంది. విక్టోరియా అజరెంకాతో జరిగిన ఆ మ్యాచ్‌లో సెరెనా ఓడిపోయిన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకోకముందే ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగడంతో గాయం తిరగబెట్టింది. ఇక ఈ సంవత్సరం మరో టోర్నమెంట్‌లో తాను ఆడే అవకాశాలు లేవని అమెరికన్‌ స్టార్‌ పేర్కొంది. గాయం మానేందుకు నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుందని సెరెనా తెలిపింది.  


Updated Date - 2020-10-01T09:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising