ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థామస్ కప్‌లో ఆడలేను

ABN, First Publish Date - 2020-09-10T08:54:01+05:30

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్‌ థామస్‌ ఉబెర్‌కప్‌ నుంచి వైదొలిగాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్‌ థామస్‌ ఉబెర్‌కప్‌ నుంచి వైదొలిగాడు. ఇదే టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో పీవీ సింధు తొలుత తప్పుకోగా, ఆ తర్వాత జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య విజ్ఞప్తితో ఆమె తిరిగి భారత బృందంలో చేరిన విషయం తెలిసిందే.


సింధు చేరికతో జోష్‌ వచ్చిందని ఆనందపడుతున్న తరుణంలో టోర్నీ నుంచి ప్రణీత్‌ తప్పుకుంటున్నాడన్న వార్త బ్యాడ్మింటన్‌ అభిమానులను నిరాశపరిచింది. ప్రణీత్‌ తప్పుకోవడంతో భారత పురుషుల బృందాన్ని కిడాంబి శ్రీకాంత్‌ నడిపించనున్నాడు. అతడితో పాటు కశ్యప్‌, లక్ష్యసేన్‌, శుభాంకర్‌ డే జట్టులో ఆడనున్నారు. ‘లాక్‌డౌన్‌తో ఐదునెలలు కోర్టుకు దూరంగా ఉండడంతో ఫిట్‌నెస్‌ దెబ్బతింది. ఈనెల 6 నుంచి సాధన ప్రారంభించా కానీ, పూర్తిగా గాడిలో పడలేదు. వచ్చే జనవరిలో ఒలింపిక్స్‌ అర్హత పోటీలు ఉండడంతో సంపూర్ణ ఫిట్‌నెస్‌ సంతరించుకున్నాకే టోర్నీల బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నా’ అని ప్రణీత్‌ తెలిపాడు.

Updated Date - 2020-09-10T08:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising