ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రూల్స్‌ అప్పుడుంటేనా.. మరిన్ని పరుగులు వచ్చేవి

ABN, First Publish Date - 2020-05-13T09:57:30+05:30

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్‌ గంగూలీకి అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా పేరుంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరోసారి గుర్తుచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచిన్‌కు దాదా ట్వీట్‌


న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్‌ గంగూలీకి అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా పేరుంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరోసారి గుర్తుచేసింది. తన ట్విటర్‌ పేజీలో వీరి ఘనతను పేర్కొంటూ.. ‘వన్డేల్లో సచిన్‌+సౌరవ్‌= 176 భాగస్వా మ్యాలు, 8,227 పరుగులు, 47.55 సగటు. మరే ఇతర ఓపెనింగ్‌ జోడీ కనీసం 6000 పరుగులు చేయలేక పోయింది’ అని ట్వీట్‌ చేసింది. అయితే సచిన్‌ ఈ ట్వీట్‌ను గంగూలీకి రీట్వీట్‌ చేస్తూ.. ‘ఇప్పు డున్న రెండు కొత్త బంతులు.. సర్కిల్‌కు ఆవల నలుగురు ఫీల్డర్ల నిబంధన అప్పుడే ఉంటే మన జోడీ ఎన్ని పరుగులు సాధించేది?’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా దాదా.. ‘కనీసం మరో 4 వేల పరుగులైనా వచ్చేవి. రెండు కొత్త బంతులను తలుచుకుంటేనే.. తొలి ఓవర్‌లోనే కవర్‌ డ్రైవ్‌ ద్వారా బౌండరీ బాదినట్టుగా అనిపిస్తోంది. ఇక 50 ఓవర్లలో అయితే చెప్పేదేముంది’ అని దాదా ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-05-13T09:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising