ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటి బ్రాండ్లకు సచిన్‌ దూరం

ABN, First Publish Date - 2020-05-31T08:58:37+05:30

భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెటర్‌గా కొనసాగిన కాలంలో.. ఆ తర్వాత కూడా ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. కానీ ఇప్పటి వరకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెటర్‌గా కొనసాగిన కాలంలో.. ఆ తర్వాత కూడా ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. కానీ ఇప్పటి వరకు పొగాకు, మద్యపాన సంబంధిత వస్తువుల తరఫున మాత్రం ఒప్పందం కుదుర్చుకోలేదు. 1996లో ఒకసారి టొబాకో కంపెనీ అతడి బ్యాట్‌కు స్పాన్సర్‌షిప్‌ చేస్తామని ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత కూడా అలాంటి కంపెనీలు చాలా ప్రయత్నాలు చేసినా తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. కెరీర్‌ ఆరంభంలోనే సచిన్‌ నుంచి తండ్రి ఈ విషయంలో మాట తీసుకున్నాడు. రిటైర్మెంట్‌ ప్రకటించాక కూడా ఓ ఆల్కహాల్‌ బ్రాండ్‌ తమతో ఒప్పందం కుదుర్చుకుంటే రూ.20 కోట్లు ఇస్తామంటూ ఆఫర్‌ చేసినా సచిన్‌ ఒప్పుకోలేదు. ఆదివారం (మే 31) ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇది ఇతర సెలబ్రిటీలకు ప్రేరణగా నిలుస్తుందని ఫేమస్‌ ఇన్నోవేషన్స్‌ ఫౌండర్‌ రాజ్‌ కాంబ్లీ తెలిపాడు. ‘భారతరత్న అందుకున్న సచిన్‌పై అందరి దృష్టీ ఉంటుంది. దశాబ్దాలుగా అతడు టొబాకో, ఆల్కహాల్‌ ఉత్పత్తుల ఒప్పందాలకు దూరంగా ఉంటున్నాడు. మిగతా సెలబ్రిటీలు కూడా సచిన్‌ మార్గంలోనే వెళ్లాలి’ అని రాజ్‌ చెప్పాడు. 

Updated Date - 2020-05-31T08:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising