ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచిన్‌ సాయం రూ.50 లక్షలు

ABN, First Publish Date - 2020-03-28T09:46:26+05:30

కరోనా వైరస్‌ నివారణకు భారత క్రీడాకారులు తమ వంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌ రూ.50 లక్షల విరాళం ప్రకటించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నివారణకు భారత క్రీడాకారులు తమ వంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌ రూ.50 లక్షల విరాళం ప్రకటించాడు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌కు చెరో రూ.25 లక్షల చొప్పున ఇస్తున్నట్టు తెలిపాడు. అసోం అథ్లెట్‌  హిమాదాస్‌ తన నెల జీతాన్ని ప్రభుత్వ ఆరోగ్య నిధికి విరాళంగా ఇచ్చింది. ఇండియన్‌ ఆయిల్‌ సంస్థలో హిమాదాస్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌గా పని చేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ క్రీడామంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్‌ లక్ష్మీ రతన్‌ శుక్లా తన 3 నెలల జీతంతో పాటు.. బీసీసీఐ నుంచి లభించే పెన్షన్‌ను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ప్రకటించాడు.

Updated Date - 2020-03-28T09:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising