ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫస్ట్ లవ్‌ను బయటపెట్టిన సచిన్

ABN, First Publish Date - 2020-02-14T23:52:46+05:30

అయితే, దానికి ముందే సచిన్‌ ప్రేమలో పడ్డారట. ఇంత కాలానికి, అది కూడా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫస్ట్ లవ్‌ని బయటపెట్టారు సచిన్. ‘మై ఫస్ట్ లవ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి చూపులోనే అంజలితో ప్రేమలో పడిపోయిన మాస్టర్.. తన మనసులోని మాటను వెల్లడించి అంజలి ప్రేమను గెలుచున్నారు. అనంతరం అంజలీనే ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. ఇది అందరికీ తెలిసిన సచిన్ లవ్ స్టోరి.


అయితే, దానికి ముందే సచిన్‌ ప్రేమలో పడ్డారట. ఇంత కాలానికి, అది కూడా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫస్ట్ లవ్‌ని బయటపెట్టారు సచిన్. ‘మై ఫస్ట్ లవ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో క్రికెట్ గ్రౌండ్‌లో ఆయన నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నారు.


ఈరోజు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా క్రికెట్‌పై తనకు ఉన్న ప్రేమను వెల్లడించారు సచిన్. చాలా మంది తమ వృత్తిని ప్రేమిస్తారు. అలా ప్రేమిస్తేనే ఆ వృత్తిలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు. అలాంటి వారందరికీ సచిన్ ఆదర్శం అనడంతో ఎలాంటి సందేహం లేదు.

Updated Date - 2020-02-14T23:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising