ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపం పవర్‌ లిఫ్టర్‌!

ABN, First Publish Date - 2020-08-14T08:53:27+05:30

రెండు వందలు, మూడు వందలు కాదు..ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో ఓ రష్యన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో జరిగిన వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 400 కి. ఎత్తబోయి ప్రాణం మీదకు..


మాస్కో : రెండు వందలు, మూడు వందలు కాదు..ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో ఓ రష్యన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో జరిగిన వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అలెగ్జాండర్‌ సెడిఖ్‌ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు. ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు.


అదృష్టవశాత్తు ‘బార్బెల్‌’ వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే సెడిఖ్‌ రెండు మోకాళ్లు విరగ్గా..తొడ కండరాలు కూడా దెబ్బతిన్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అతడి కాళ్లకు శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు నెలలపాటు అలెగ్జాండర్‌ మంచానికి పరిమితం కావాల్సి ఉంటుంది.  రష్యాలో 2019లో వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల రడోస్కేవిచ్‌ మూడో ప్రయత్నంలో 250 కేజీల బరువెత్తబోయి గాయపడి కెరీర్‌కు స్వస్తిపలకాల్సి వచ్చింది. 


Updated Date - 2020-08-14T08:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising