ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనం అందరం క్రూరులం.. ఏనుగు వధపై రోహిత్, కోహ్లీ ఆగ్రహం

ABN, First Publish Date - 2020-06-04T20:35:02+05:30

కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విషయం తెలిసిందే. గర్భంతో ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విషయం తెలిసిందే. గర్భంతో ఉన్న ఏనుగు ఆహారం కోసం ఊళ్లోకి వచ్చింది. కొందరు వ్యక్తులు బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను నోటికి అందించారు. ఏనుగు ఆశగా దాన్ని కొరకగానే నోట్లో పేలిపోయింది. భరించలేని బాధతో ఊరంతా పరుగులు పెట్టిన ఆ ఏనుగు.. పక్కనే ఉన్న వెల్లియార్ నదిలోకి వెళ్లింది. కొద్దిసేపటికి అక్కడే అలా నదిలో నిలబడే ప్రాణాలు వదిలింది. గ్రామస్థులెవరికీ హాని చేయని ఆ ఏనుగు కొందరు ఆకతాయిలు చేసిన పనికి బలైంది.


ఈ దుర్ఘటనపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేరళలో జరిగిన ఘటన విని ఆందోళన చెందాను. జంతువులపై ప్రేమించుదాము. ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకాలి’’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘‘మనం అందరం క్రూరులం. నేర్చుకోవడం లేదా? కేరళలో ఏనుగు విషయంలో జరిగింది తెలిసి మనసు విరిగిపోయింది. ఏ జంతువుతో కూడా ఇలా క్రూరంగా ప్రవర్తించ వద్దు’’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. వీరిద్దరితో పాటు.. పలువురు భారత క్రికెటర్లు, ఇండియా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రీ, తదితరులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-04T20:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising