ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కీప్ ఇట్‌ అప్’ ఛాలెంజ్ పూర్తి చేసిన రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే

ABN, First Publish Date - 2020-05-17T21:36:17+05:30

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రారంభించిన ‘కీప్ ఇట్ అప్’ ఛాలెంజ్‌ను టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రారంభించిన ‘కీప్ ఇట్ అప్’ ఛాలెంజ్‌ను టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పూర్తి చేశారు. అయితే కాస్త వినూత్నంగా వీళ్లిద్దరు ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్ చేయాల్సిందిగా రోహిత్‌ను యువరాజ్ నామినేట్ చేస్తే.. అనిల్ కుంబ్లేకి హర్భజన్ సింగ్ నుంచి నామినేషన్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌ను రోహిత్ బ్యాట్ హాండిల్‌పై పూర్తి చేశాడు. ఈ ఛాలెంజ్ చేయాలని అతను తన తోటి క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అజింక్యా రహానేలను నామినేట్ చేశాడు. ఇక బ్యాట్ లేకపోవడంతో.. చేతితోనే ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన అనీల్ కుంబ్లే.. తదుపరిగా వీవీఎస్ లక్ష్మణ్, కేఎల్ రాహుల్, వీరేంద్ర సెహ్వాగ్‌లను నామినేట్ చేశారు. 


ఈ ఛాలెంజ్‌ను టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. కళ్లకు గంతలు కట్టుకొని ఈ ఛాలెంజ్‌ని ఆయన పూర్తి చేశారు. అయితే చివర్లో చిన్న ట్విట్ కూడా ఇచ్చారు. కళ్లకు కట్టుకున్న గంతల నుంచి తనకు కనిపిస్తుందని సచిన్ వెల్లడించారు. అలా చేయాలని రివర్స్‌లో యువరాజ్‌నే ఆయన మళ్లీ ఛాలెంజ్ చేశారు.





Updated Date - 2020-05-17T21:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising