ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీర్ఘకాలిక లక్ష్యాలతో ఒత్తిడి

ABN, First Publish Date - 2020-05-15T10:16:09+05:30

ఆటగాడు ఎవరైనా దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకుంటే ఒత్తిడి తప్పదని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. అందుకే తాను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆటగాడు ఎవరైనా దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకుంటే ఒత్తిడి తప్పదని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. అందుకే తాను స్వల్పకాలిక లక్ష్యాల్ని పెట్టుకుంటానని చెప్పాడు. భవిష్యత్‌లో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తానని తెలిపాడు. ‘దీర్ఘకాలిక లక్ష్యాలు పెద్దగా ఫలితాలివ్వవని నా సుదీర్ఘ కెరీర్‌ ద్వారా అర్థమైంది. అంతేకాదు వాటివల్ల ఒత్తిడి కూడా ఏర్పడుతుందని గ్రహించా. అందువల్ల నేను ఎప్పుడూ రెండు, మూడు నెలల్లో జరిగే కొన్ని మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకునే సన్నద్ధమవుతుంటా. ఈ విధానం ఎంతో ఉత్తమం, ఉపయుక్తంగా కూడా ఉంటుంది’ అని రోహిత్‌ వివరించాడు. రాబోయే రోజుల్లోనూ ఈ పంథానే కొనసాగిస్తానని తెలిపాడు. లాక్‌డౌన్‌పై మాట్లాడుతూ..తామంతా క్రీడా కార్యక్రమాల పునరుద్ధరణకు ఎదురు చూస్తున్నామని తెలిపాడు. ‘క్రికెట్‌ పోటీలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఓ అంచనాకు రాలేకపోతున్నాం. అయితే, త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయన్న ఆశాభావంతో ఉన్నాం. టీ20 వరల్డ్‌కప్‌, ఐపీఎల్‌లో ఏది ఆడతామో చూడాలి’ అని రోహిత్‌ అన్నాడు.

Updated Date - 2020-05-15T10:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising