ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచకప్‌లో నా ఫేవరెట్ సెంచరీ అదే: రోహిత్ శర్మ

ABN, First Publish Date - 2020-08-03T01:59:54+05:30

ప్రపంచకప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాది క్రికెట్ చరిత్రలోనే రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ సెంచరీలన్నింటిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రపంచకప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాది క్రికెట్ చరిత్రలోనే రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ సెంచరీలన్నింటిలో తనకిస్టమైన సెంచరీ మాత్రం మొదటి మ్యాచ్‌లో సౌత్‌ఆఫ్రికాపై చేసిందేనని అంటున్నాడు. ట్విటర్ వేదికగా రోహిత్ ఇటీవల ఓ ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించాడు. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు రోహిత్ సమాధానాలిచ్చాడు. అందులో భాగంగా ‘ప్రపంచకప్‌లో మీకు నచ్చిన సెంచరీ ఏద’ని ఓ అభిమాని అడిగాడు. దీనికి సమాధానంగా మొదటి మ్యాచ్‌లో సౌత్‌ఆఫ్రికాపై చేసిన సెంచరీనే తనకిష్టమని చెప్పాడు. ‘ఆ మ్యాచ్‌లో సౌత్‌ఆఫ్రికా చేసింది తక్కువ పరుగులే. కానీ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. ప్రత్యర్థి బౌలర్లు కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో సెంచరీ కొట్టడం చాలా ఆనందంగా ఉంద’ని రోహిత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఆ మ్యాచ్‌లో రోహిత్ సౌత్‌ఆఫ్రికాపై 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ సెంచరీతో భారత్ 6 వికెట్ల తేడాతో సఫారీలపై సునాయాసంగా విజయం సాధించింది.



Updated Date - 2020-08-03T01:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising