ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాదీ ఆడలేనేమో!

ABN, First Publish Date - 2020-12-15T06:08:05+05:30

స్విట్జర్లాండ్‌ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ చేసిన ప్రసంగం ప్రపంచ టెన్ని్‌సలో కలకలం రేపింది. వచ్చే ఏడాది పోటీల బరిలోకి దిగేందుకు తన శరీరం సహకరించే అవకాశాలు లేవని వెల్లడించడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఫెడరర్‌ నోట రిటైర్మెంట్‌ మాట


న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ చేసిన ప్రసంగం ప్రపంచ టెన్ని్‌సలో కలకలం రేపింది. వచ్చే ఏడాది పోటీల బరిలోకి దిగేందుకు తన శరీరం సహకరించే అవకాశాలు లేవని వెల్లడించడం.. టెన్ని్‌సకు అతడు గుడ్‌బై చెబుతాడన్న ఊహాగానాలకు తెరతీసింది. ‘గత 70 ఏళ్లలో స్విట్జర్లాండ్‌ గొప్ప క్రీడాకారుడు’ అవార్డును ఫెడరర్‌ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజర్‌.. ‘2021లో నేను కోర్టులోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. కానీ అది జరుగుతుందో లేదో చూడాలి’ అని అనడంతో అంతా అవాక్కయ్యారు. అంతే కాదు..తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘నా కెరీర్‌ ఇక్కడితో ఆగిపోవాల్సి ఉంటే.. ఈ అవార్డుతో ముగించడం కంటే అద్భుతం ఏమి ఉంటుంది’ అని అతడు వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. 39 ఏళ్ల ఫెడెక్స్‌ చివరిగా నిరుటి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడాడు. అనంతరం ఫిబ్రవరిలో మోకాలి ఆపరేషన్‌ చేయించుకున్న అతడు.. 2020 సీజన్‌లో బరిలోకి దిగడం లేదని జూన్‌లో ప్రకటించాడు. 

Updated Date - 2020-12-15T06:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising