ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాక్‌స్టార్ జడేజా నా అభిమాన క్రికెటర్: హ్యాట్రిక్ బౌలర్

ABN, First Publish Date - 2020-02-22T22:25:43+05:30

ఆస్ట్రేలియా హ్యాట్రిక్ హీరో ఆష్టన్ అగర్ టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన అభిమాన క్రికెటర్ అని వెల్లడించాడు. అంతేకాక.. రవీంద్ర జడేజాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహెన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియా హ్యాట్రిక్ హీరో ఆష్టన్ అగర్ టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన అభిమాన క్రికెటర్ అని వెల్లడించాడు. అంతేకాక.. రవీంద్ర జడేజాతో జరిపిన సంభాషణ తనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడిందని అతను పేర్కొన్నాడు. 


ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించిన సమయంలో అతను జడేజాతో మాట్లాడానని.. ఆ సమయంలో అతను చెప్పిన మాటలు తనకు ఎంతో స్పూర్తిని ఇచ్చాయని అతను పేర్కొన్నాడు. కాగా, అగర్ హ్యాట్రిక్‌తో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాపై 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ.. ‘‘ఇండియా సిరీస్ తర్వాత జడేజాతో నేను మాట్లాడాను. స్పిన్ బౌలింగ్ గురించి మేము చాలా సేపు చర్చించాము. బంతిని ఎంత ఎక్కువ స్పిన్ చేయగలిగితే అంత చేయమని అతను నాకు సలహా ఇచ్చాడు’’ అని పేర్కొన్నాడు. 


ఇక తనకు జడేజాలా ఆడాలని ఉందని అతను తెలిపాడు. ‘‘అతను నా అభిమాన క్రికెటర్. అతను క్రికెట్ ఎలా ఆడుతాడో.. నాకు అలా ఆడాలని ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్, స్పిన్ అన్ని విభాగాల్లో అతను అదరగొడతాడు. అందుకే అతను నా దృష్టిలో రాక్‌స్టార్. అతన్ని చూస్తుంటే.. నాలో ధైర్యం పెరిగింది’’ అని అగర్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-02-22T22:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising