ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. ఊతప్ప సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-06-04T22:13:57+05:30

2007 టీ-20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీం ఇండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప సంచలన విషయాలు వెల్లడించాడు. క్రికెట్‌కి దూరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2007 టీ-20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీం ఇండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప సంచలన విషయాలు వెల్లడించాడు. క్రికెట్‌కి దూరం కావడంతో తన కెరీర్‌లో ధాదాపు రెండు సంవత్సరాలు తీవ్రస్థాయిలో డిప్రెషన్‌లోకి వెళ్లానని.. బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వచ్చేవి అని అతను తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు గూటికి చేరిన అతను రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘మైండ్, బాడీ అండ్ సోల్‌’ లైవ్ సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. 


‘‘2006లో నేను ఆరంగేట్రం చేశాను. అప్పుడు నా గురించి నాకు పూర్తిగా తెలియదు. దీంతో నా గురించి నేను తెలుసుకోవడం ప్రారంభించాను. ప్రస్తుతం నా ఆలోచనల్లో క్లారిటీ ఉంది. కిందపడితే తిరిగి పైకి ఎలా లేవాలి అనే దానిపై అవగాహన ఉంది. నేను ఈ స్థానంలో ఉండటానికి ఎన్నో అడ్డంకులు దాటి వచ్చాను’’ అని ఊతప్ప తెలిపాడు. 


‘‘2009 నుంచి 2011 మధ్య నా జీవితంలోనే అత్యంత గడ్డుకాలం. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. బాల్కనీ నుంచి దూకాలని.. ఒకటి, రెండు, మూడు అని లెక్క కూడా పెట్టాను. కానీ ఏదో శక్త నన్ను ఆపింది. మెల్లిగా ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు కేవలం క్రికెట్ గురించి మాత్రమే ఆలోచించడం లేదు.. చాలా అంశాలపై దృష్టి పెట్టాను. దీంతో జీవితం ప్రశాంతంగా సాగుతుంది.  నేను వెళ్లే మార్గం సరైనదా.. కాదా అని అన్వేషించుకుంటూ నా రోటీన్‌ లైఫ్‌లో ముందుకు సాగుతున్నా’’ అని ఊతప్ప అన్నాడు. 

Updated Date - 2020-06-04T22:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising