ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా..

ABN, First Publish Date - 2020-06-05T09:19:03+05:30

కుంగుబాటు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో రెండేళ్లపాటు నరకం అనుభవించానని టీమిండియా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కుంగుబాటు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో రెండేళ్లపాటు నరకం అనుభవించానని టీమిండియా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్ప వెల్లడించాడు. ఒకనొక దశలో బాల్కనీ నుంచి దూకేద్దామనే స్థితికి వెళ్లా.. కానీ, అలా చేయకుండా ఏదో శక్తి అడ్డుకొందన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రాబిన్‌ ఆడుతున్నాడు. రాయల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మనసు, శరీరం, ఆత్మ’ కార్యక్రమం లైవ్‌ సెషన్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి ఊతప్ప మాట్లాడాడు. ‘2009-11 మధ్య మానసికంగా దారుణ స్థితిని అనుభవించా. నా ఆలోచనలన్నీ ఆత్మహత్య చుట్టూ తిరుగుతుండేవి. బాల్కనీ నుంచి దూకేయాలని అనిపించేది. కానీ, ఏదో అదృశ్యశక్తి ఆపేది’ అని చెప్పాడు. టీమిండియాలో చోటు దక్కని దశలో ఇదంతా జరిగిందన్నాడు. ఇతరుల సహాయంతో కుంగుబాటు నుంచి బయటపడ్డానన్నాడు. 

Updated Date - 2020-06-05T09:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising