ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గీత దాటకండి.. లాక్‌డౌన్‌పై అశ్విన్ ఎలా ట్వీట్ చేశాడంటే..

ABN, First Publish Date - 2020-03-25T21:19:09+05:30

2019 ఐపీఎల్‌లో జరిగిన ఓ ఘటన యావత్ క్రికెట్ లోకాన్ని కుదిపేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2019 ఐపీఎల్‌లో జరిగిన ఓ ఘటన యావత్ క్రికెట్ లోకాన్ని కుదిపేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యర్థి ఆటగాడు జాస్‌ బట్లర్‌ను మాన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది సరైన పద్ధతే అయినప్పటికీ.. కొందరి నుంచి మాత్రం విమర్శల వర్షం కురిసింది. కొద్ది రోజుల పాటు దీనిపై చర్చ జరిగ.. ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.


అయితే ఈ మన్కడింగ్‌కి తెరలేపి సంచలనం సృష్టించిన అశ్విన్ తను చేసిన పనిని కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సరదగా ఉపయోగించుకున్నాడు. దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండాలంటూ.. 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అశ్విన్ వినూత్న రీతిలో స్పందించాడు. 


తను మన్కడింగ్ చేస్తున్న ఫొటోని ట్వీట్ చేసిన అశ్విన్ ‘‘హహహ, ఇది నాకు ఎవరో పంపించారు. ఈ రనౌట్ జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. దేశం లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో, ఇది పౌరులకు సరైన సూచన. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు.  

Updated Date - 2020-03-25T21:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising