ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

39 ఏళ్ల క్రితం సరిగ్గా ఇక్కడే.. రవిశాస్త్రి భావోద్వేగం

ABN, First Publish Date - 2020-02-21T02:15:55+05:30

భారత్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపు (శుక్రవారం) వెల్లింగ్టన్‌లో తొలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపు (శుక్రవారం) వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. రేపటి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. 39 సవంత్సరాల క్రితం అంటే 1981లో ఫిబ్రవరి 21న ఇదే మైదానంలో జరిగిన టెస్టుతో ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. తాజాగా మైదానంలో అడుగుపెట్టిన రవి.. 39 ఏళ్ల నాటి స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 


‘‘మళ్లీ ఇదే మైదానంలో అడుగుపెడతానని నేనెప్పుడూ అనుకోలేదు. అదే మైదానంలో, అదే ప్రత్యర్థితో, అదే రోజు తలపడతామని ఊహించలేదు’’ అని చతేశ్వర్ పుజారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.


‘‘డ్రెస్సింగు రూములోకి వెళ్లాను. అదే రూము. అలాగే ఉంది. ఏమాత్రం మార్పులేదు. బేసిన్ రిజర్వులో 39 ఏళ్ల క్రితం అరంగేట్రం చేశా. నేనిది నమ్మలేకపోతున్నా. 39 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 21’’ అని రవిశాస్త్రి గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 


‘‘నాకింకా గుర్తుంది. రాత్రి 9:30 గంటలకు న్యూజిలాండ్ చేరుకున్నా. దివంగత బాపు నాదకర్ణి ఎయిర్‌పోర్టుకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. నేను నేరుగా హోటల్‌కు చేరుకున్నాను. నా రూమ్మేట్ దిలీప్ వెంగ్‌సర్కార్. అయితే అప్పుడెవరూ గదుల్లో లేరు. ఉదయం సునీల్ గవాస్కర్ టాస్ ఓడిపోయాడు. మనం మైదానంలోకి వెళ్తున్నాం. ‘నువ్వు కూడా గేమ్ ఆడుతున్నావ్’ అని గవాస్కర్ నాతో చెప్పాడు’’ అని రవి గుర్తు చేసుకున్నాడు. 


ఆ టెస్టులో రవిశాస్త్రి బంతితో రాణించాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే, ఆ మ్యాచ్‌లో ఇండియా 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 


‘‘ఆ రోజు నేను నెర్వస్‌గా ఉన్నా. తొలి మ్యాచ్ ఆడే ఎవరికైనా అలానే ఉంటుందనుకుంటా. ఆ మ్యాచ్‌లో తొలి వికెట్‌గా జెరెమీ కోనీని అవుట్ చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని రవి పేర్కొన్నాడు. 


‘‘భారత్‌‌తో పోలిస్తే అక్కడి వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నం. వాతావరణం చాలా చాలా చల్లగా ఉంటుంది. హోరు గాలులు వీస్తాయి. నాకు స్వెటర్ లేకపోవడంతో పాలి ఉమ్రిగర్ స్వెటర్ ఇచ్చి ఆదుకున్నాడు’’ అని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.  

Updated Date - 2020-02-21T02:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising