ఐపీఎల్: బెంగళూరు టార్గెట్ 155
ABN, First Publish Date - 2020-10-03T23:10:10+05:30
ఐపీఎల్ 2020లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్...
అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు స్మిత్ 5 పరుగులకే ఉదన బౌలింగ్‌లో ఔట్ కావడంతో డీలా పడింది. మరో ఓపెనర్ బట్లర్ కూడా 22 పరుగులకే సైనీ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో కూడా నిరాశపరిచాడు. చాహల్ బౌలింగ్‌లో స్ట్రయిట్ షాట్‌కు యత్నించి చాహల్‌కే క్యాచ్‌గా చిక్కి 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
రాబిన్ ఊతప్ప 17 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లోనే షాట్‌కు యత్నించి ఉదనకు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. మహిపాల్ లోమ్రోర్ 47 పరుగులతో రాణించాడు. 39 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 47 పరుగులు చేసి రాజస్థాన్ స్కోర్‌లో కీలక భాగమయ్యాడు. పరాగ్ 16 పరుగులు చేయగా.. చివర్లో తెవాటియా 3 సిక్స్‌లతో మెరిశాడు. 12 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఆర్చర్ 10 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
Updated Date - 2020-10-03T23:10:10+05:30 IST