ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విస్తరణకు ఐపీఎల్ సిద్ధంగా ఉంది: రాహుల్ ద్రవిడ్

ABN, First Publish Date - 2020-11-14T01:25:24+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విస్తరణపై టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశంలో కావాల్సినంత టాలెంట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విస్తరణపై టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశంలో కావాల్సినంత టాలెంట్ ఉందని, ప్రతిభ, సంఖ్య విషయంలో రాజీపడకుండా ‘విస్తరణకు సిద్ధంగా ఉందని’ పేర్కొన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించారు. ప్రేక్షకులను అనుమతించనప్పటికీ టోర్నీ విజయవంతమైంది. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ను నిర్ణీత సమయానికే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే, 2021 ఐపీఎల్‌లో మరో కొత్త ఫ్రాంచైజీ చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఐపీఎల్ జట్ల సంఖ్య 9కి పెరుగుతుంది. 2023 నాటికి ఈ సంఖ్యను 10కి పెంచేలన్నది బీసీసీఐ యోచన.


దేశంలో ప్రతిభ కలిగిన ఆటగాళ్లు చాలామందే ఉన్నారని, కానీ వారికి సరైన అవకాశాలు రావడం లేదని పేర్కొన్న ద్రవిడ్.. టాలెంట్ పరంగా చూస్తే విస్తరణకు ఐపీఎల్ సిద్ధంగా ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. ఎక్కువ జట్లు ఉంటే ప్రతిభ కలిగిన ఆటగాళ్లందరికీ అవకాశం లభిస్తుందని, అప్పుడు రాజీపడాల్సిన అవసరం ఉండదని అన్నాడు. టాలెంట్ కోణంలో చూస్తే కొత్త పేర్లు, ముఖాలకు మనం సిద్ధంగా ఉన్నట్టు విశ్వసిస్తున్నట్టు ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. 


రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదాలే రాసిన ‘ఎ న్యూ ఇన్నింగ్స్’ పుస్తకాన్ని వర్చువల్‌గా లాంచ్ చేసిన ద్రవిడ్ అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ పుస్తకానికి ఇంగ్లిష్ మాజీ క్రికెటర్ సైమన్ హ్యూస్ సహ రచయిత. ఐపీఎల్ విస్తరణకు సిద్ధంగా ఉందన్న ద్రవిడ్ వ్యాఖ్యలను బదాలే కూడా సమర్థించారు. 2021 ఐపీఎల్‌తో 9 జట్లతో ఆడడం సాధ్యమేనని అన్నారు.  

Updated Date - 2020-11-14T01:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising