ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెన్మార్క్‌ ఓపెన్‌లో సింధు ఆడేనా?

ABN, First Publish Date - 2020-09-17T08:49:11+05:30

డెన్మార్క్‌లోని అర్హస్‌ వేదికగా వచ్చేనెల 3 నుంచి 11 వరకు జరగాల్సిన థామ్‌స-ఉబెర్‌ కప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: డెన్మార్క్‌లోని అర్హస్‌ వేదికగా వచ్చేనెల 3 నుంచి 11 వరకు జరగాల్సిన థామ్‌స-ఉబెర్‌ కప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయితే, వచ్చేనెల 13 నుంచి 18 వరకు అదే దేశంలో జరగాల్సిన డెన్మార్క్‌ ఓపెన్‌ షెడ్యూల్‌లో మాత్రం మార్పులేదని అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రకటించింది. ఈ టోర్నీలో పోటీపడతానని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇదివరకే ప్రకటించింది. అయితే, థామస్‌ కప్‌ వాయిదాతో సింధు ఆ టోర్నీలో ఆడాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆడడంపై ఈనెల 27న మా నిర్ణయం ప్రకటిస్తాం. చూద్దాం.. అప్పటివరకు ఆతిథ్య నగరంలో కొవిడ్‌ పరిస్థితులు ఎలా ఉంటాయో’ అని సింధు తండ్రి పీవీ రమణ వ్యాఖ్యానించాడు. యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మాత్రం తాను కచ్చితంగా డెన్మార్క్‌ వెళతానని స్పష్టం చేశాడు. సైనా, కశ్యప్‌, సిక్కిరెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 


సాధన మొదలైతే కానీ..

న్యూఢిల్లీ: కొవిడ్‌ విజృంభణ దృష్ట్యా అంతర్జాతీయ క్యాలెండర్‌పై ఇంకా స్పష్టత రాకపోవడంతో షట్లర్లు సాధన విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్యాడ్మింటన్‌ క్యాలెండర్‌ మొదలవుతుందన్న వాస్తవాన్ని నమ్మే పరిస్థితిలో క్రీడాకారులు లేరు. అందుకే, అంతా ఒక్కచోట చేరి సాధన చేసే విషయంలో షట్లర్లు ఏమీ తేల్చుకోలేకపోతున్నారు’ అని గోపీ తెలిపాడు.

Updated Date - 2020-09-17T08:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising