ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివర్లో చేతులెత్తేసిన పంజాబ్ బౌలర్లు.. ముంబై భారీ స్కోరు

ABN, First Publish Date - 2020-10-19T02:59:16+05:30

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9), సూర్యకుమార్ యాదవ్ (0), ఇషన్ కిషన్ (7), హార్దిక్ పాండ్యా (8) రాణించకపోయినా, డికాక్ (53), కృనాల్ పాండ్యా (34) బ్యాట్‌కు పని చెప్పడంతో స్కోరు ముందుకు కదిలింది. పంజాబ్ తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ చివరల్లో చేతులెత్తేసి పరుగులు భారీగా సమర్పించుకుంది. 


15 ఓవర్లకు ముంబై స్కోరు 114/4 మాత్రమే. అయితే, హార్దిక్ పాండ్యా, డికాక్‌ (53) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్, కౌల్టర్ నైల్‌లు చెలరేగిపోయారు. పొలార్డ్ అయితే బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. 12 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు చేయగా, నైల్ 12 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోరు జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టింది. జోర్డాన్ వేసిన చివరి ఓవర్లో పొలార్డ్ రెండు సిక్సర్లు, ఫోర్ బాదడంతో ముంబై 176 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్షదీప్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-10-19T02:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising