గర్వించే క్షణం.. అవార్డు గ్రహీతలపై కోహ్లీ ట్వీట్!
ABN, First Publish Date - 2020-08-23T02:55:55+05:30
రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు పొందిన క్రికెటర్ రోహిత్ శర్మ, అలాగే అర్జున అవార్డు పొందిన ఇషాంత్ శర్మ, దీప్తి శర్మలకు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు.
ముంబై: రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు పొందిన క్రికెటర్ రోహిత్ శర్మ, అలాగే అర్జున అవార్డు పొందిన ఇషాంత్ శర్మ, దీప్తి శర్మలకు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా వీరిని అభినందించిన కోహ్లీ.. ఇది జీవితంలో గర్వించాల్సిన క్షణమని చెప్పాడు. ‘ఏ క్రీడాకారుడికైనా ఇది గర్వపడాల్సిన క్షణం’ అని ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు కేవలం నలుగురు క్రికెటర్లే ఖేల్‌రత్న అవార్డును పొందారు. వారిలో కోహ్లీ కూడా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఈ అవార్డు గ్రహించిన రోహిత్.. ఖేల్‌రత్న పొందిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
Updated Date - 2020-08-23T02:55:55+05:30 IST