ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్ మిశ్రాకు గాయం.. ఢిల్లీ జట్టులోకి ప్రవీణ్ దూబే

ABN, First Publish Date - 2020-10-20T00:10:26+05:30

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో మిశ్రా కుడిచేయి మధ్యవేలికి గాయమైంది. ఆ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో మిశ్రా కుడిచేయి మధ్యవేలికి గాయమైంది. ఆ తర్వాత అతడికి సర్జరీ కాగా, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 37 ఏళ్ల మిశ్రా ఐపీఎల్‌కు దూరం కావడంతో అతడి స్థానాన్ని కర్ణాటకకు చెందిన లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబేతో భర్తీ చేశారు. ఇప్పటికే యూఏఈలో ఉన్న దూబే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నెట్ బౌలర్‌గా ఉన్నాడు. 27 ఏళ్ల దూబేను 2016 వేలంలో బెంగళూరు రూ. 35 లక్షలకు కొనుగోలు చేసింది. అతడు బెంగళూరు కోసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రెండు సీజన్ల తర్వాత దూబేను బెంగళూరు ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. 


కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో దూబే చక్కని ప్రతిభ చూపాడు. 2015-16 కేపీఎల్ సీజన్‌లో బెళగావి పాంథర్స్ తరపున ఆడిన దూబే 6.89 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీసుకున్నాడు. 2017-18 సీజన్‌లో తమిళనాడుతో జరిగిన టీ20లో 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అదే అతడి అత్యుత్తమ ప్రదర్శన. ఫస్ట్ క్లాస్ గేమ్స్‌తోపాటు 8 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు. 

Updated Date - 2020-10-20T00:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising