ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాద్ క్రికెటర్

ABN, First Publish Date - 2020-02-21T20:31:52+05:30

టీమిండియా సీనియర్ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లలో దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 33 ఏళ్ల ఓజా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. 24 టెస్టుల్లో 113 వికెట్లు, 18 వన్డేల్లో 21 వికెట్లు తీసుకున్నాడు. ఆరు టీ20లు ఆడాడు. 2013లో చివరి టెస్టు ఆడిన ఓజా.. ఐపీఎల్‌లో దక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో 2004 నుంచి 2015 వరకు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 108 మ్యాచ్‌లలో 424 వికెట్లు తీశాడు.   


వీడ్కోలు ప్రకటన సందర్భంగా తన ఉన్నతికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితంలో మరో అడుగు వేసేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. ఎంఎస్ ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు.. టెస్ట్ టోపీ అందించిన సచిన్ టెండుల్కర్, సతీమణి, కుటుంబ సభ్యులను పేరు పేరునా గుర్తు చేసుకున్నాడు.    

Updated Date - 2020-02-21T20:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising