ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు పెట్టిన దళిత హక్కుల సంఘం

ABN, First Publish Date - 2020-06-04T19:59:41+05:30

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై దళిత హక్కుల సంఘం నేత రజత్ కల్సన్ పోలీసులు కేసు పెట్టారు. ఇటీవల రోహిత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై దళిత హక్కుల సంఘం నేత రజత్ కల్సన్ పోలీసులు కేసు పెట్టారు. ఇటీవల రోహిత్ శర్మ‌తో కలిసి నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో యువరాజ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీం ఇండియా యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్‌‌ను ‘భాంగీ’ అని యువరాజ్ అన్నాడు. దీంతో యువరాజ్‌పై సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. యువరాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. 


అయితే హరియాణాలోని హిసార్‌ ప్రాంతంలో తాజాగా అతనిపై పోలీసు కేసు పెట్టారు. ఈ కేసులో రోహిత్ శర్మ‌ని కూడా టార్గెట్ చేశారు. యువరాజ్ వ్యాఖ్యలను రోహిత్ ఎందుకు ఖండించలేదని కల్సన్ ప్రశ్నించారు. యువరాజ్ అన్న మాట విన్న రోహిత్ నవ్వి ఎలా ఊరుకుంటాడని ఆయన అన్నారు. యువరాజ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని.. ఇందుకు సంబంధించిన సీడీలు, పత్రాలు పోలీసులకు అందజేశామని తెలిపారు. 


దీనిపై ఎస్పీ లోకేంద్ర సింగ్ మాట్లాడుతూ.. విచారణకు సంబంధించిన వివరాలను ఇప్పటికే డీజీపీకి అందించామని.. యువరాజ్ తప్పు చేసినట్ల నిర్ధారణ జరిగితే.. అతనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Updated Date - 2020-06-04T19:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising