ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ మన్‌ప్రీత్‌

ABN, First Publish Date - 2020-02-14T09:47:24+05:30

భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు లభించిన తొలి భారతీయుడు మన్‌ప్రీత్‌నే కావడం విశేషం. ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో మన్‌ప్రీత్‌కు 35.2 శాతం ఓట్లు రాగా, ఆర్థర్‌ వాన్‌ డొర్రెన్‌ (బెల్జియం) 19.7,  లుకాస్‌ విల్లా (అర్జెంటీనా) 16.5 శాతం ఓట్లు వచ్చాయి. 27 ఏళ్ల ఈ మిడ్‌ ఫీల్డర్‌ లండన్‌ (2012), రియో (2016) ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గత ఏడాది జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో చెలరేగి ఆడిన మన్‌ప్రీత్‌ భారత్‌కు టోక్యో బెర్త్‌ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ‘ఈ అవార్డు భారత జట్టుకు అంకితమిస్తున్నా. నాకు ఓటేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’ అని మన్‌ప్రీత్‌ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-02-14T09:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising