ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్‌ క్రికెటర్‌పై సస్పెన్షన్ వేటు.. పీసీబీ సంచలన నిర్ణయం..

ABN, First Publish Date - 2020-02-20T17:17:48+05:30

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాడు ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు  (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు పీసీబీ ఇవాళ ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు.


‘‘ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు..’’ అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.  ఓ ఫిట్‌నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. లాహార్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన అక్మల్... అక్కడి సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తరపున అక్మల్ చివరిసారి కనిపించాడు. 

Updated Date - 2020-02-20T17:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising