ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమర్ అక్మల్ శిక్ష తగ్గించొద్దు.. కోర్టుకెక్కనున్న పాకీస్తాన్

ABN, First Publish Date - 2020-08-11T21:51:11+05:30

క్రికెటర్ ఉమర్ అక్మల్ కేసులో పాకీస్తాన్ క్రికెట్ బోర్డు కోర్టుకెక్కనుంది. నిబంధనలు అతిక్రమించినందుకుగాను అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: క్రికెటర్ ఉమర్ అక్మల్ కేసులో పాకీస్తాన్ క్రికెట్ బోర్డు కోర్టుకెక్కనుంది. నిబంధనలు అతిక్రమించినందుకుగాను అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిని స్వతంత్ర న్యాయస్థానం మూడేళ్ల నుంచి ఏడాదిన్నరకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై పాక్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సవాల్ చేస్తూ క్రీడావిభాగ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ‘అనేక సార్లు బూకీలు కలిసినప్పటికీ అక్మల్ తమకు సమాచారం ఇవ్వలేదు. దీంతో అతడిపై మూడేళ్ల పాటు నిషేధం విధించాం. కానీ స్వతంత్ర న్యాయమూర్తి దీనిని సగానికి తగ్గంచారు. దీని వల్ల ఇతర క్రికెటర్లు కూడా ప్రభావితం అవుతారు. పీసీబీ నిబంధనలకు విలువ తగ్గిపోతుంది. అందువల్ల అక్మల్‌పై నిషేధాన్ని తగ్గించ వద్దం’టూ పీసీబీ తన అప్పీల్‌లో పేర్కొననుంది.

Updated Date - 2020-08-11T21:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising