తన గొయ్యి తనే తవ్వుకుంది.. పాక్‌పై రమీజ్‌రజా కామెంట్స్!
ABN, First Publish Date - 2020-08-23T02:23:13+05:30
ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టుపై పాక్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ రమీజ్‌రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
లండన్: ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్టుపై పాక్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ రమీజ్‌రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. దీనిపై రమీజ్‌రజా అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారని, వారిని కట్టడి చేయడంలో పాక్ బోల్తాపడిందని ఆయన తేల్చిచెప్పాడు. తొలిరోజు 300పైచిలుకు పరుగులు సాధించారంటే.. ఇంగ్లండ్ కచ్చితంగా 500పైగా పరుగులు చేస్తుందని చెప్పాడు. ‘అంత భారీ స్కోరును ఛేజ్ చేయడానికి పాక్ బ్యాట్స్‌మెన్‌కు సమయం అవసరం అవుతుంది. కానీ వర్షం, సరైన వెలుతురు లేకపోవడంతో వారి వద్ద ఆ సమయం ఉండదు. తొలి రెండు సెషన్లలో ఫర్వాలేదనిపించిన పాక్.. చివరి సెషన్లో పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది’ అని రమీజ్‌రజా పేర్కొన్నాడు. కాగా, మూడో టెస్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాక్ క్రైలీ(171), బట్లర్(87) క్రీజులో ఉన్నారు.
Updated Date - 2020-08-23T02:23:13+05:30 IST