ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజరెంకా అవుట్‌

ABN, First Publish Date - 2020-10-01T09:33:54+05:30

పునరాగమనాన్ని ఘనం గా చాటుతూ ఇటీవల యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ విక్టోరియా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో రౌండ్‌లో నడాల్‌, థీమ్‌, హలెప్‌  

పారిస్‌: పునరాగమనాన్ని ఘనం గా చాటుతూ ఇటీవల యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ విక్టోరియా అజరెంకా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రం ఆ జోరు చూపలేకపోయింది. ఈ మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ రెండో రౌండ్లో అనామక క్రీడాకారిణి చేతిలో కంగుతిని టోర్నీ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో స్లోవేకియా అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి అన్నా కరోలినా స్కిమిద్లోవా 2-6, 2-6తో పదోసీడ్‌ అజరెంకాను చిత్తుచేసి మూడోరౌండ్‌కు దూసుకెళ్లింది. గతంలో ఒక్కసారి కూడా గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ నెగ్గని స్కిమిద్లోవా తొలిరౌండ్లో వెటరన్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. మిగతా స్టార్‌ క్రీడాకారిణుల్లో టాప్‌సీడ్‌ హలెప్‌ 6-3, 6-4తో కమిలియా బెగుపై, మూడోసీడ్‌ స్విటోలినా 6-3, 0-6, 6-2తో జరజువాపై, ఐదోసీడ్‌ కికీ బెర్టెన్స్‌7-6, 3-6, 9-7తో సారా ఎరానిపై, 16వ సీడ్‌ మెర్టెన్స్‌ 6-4, 7-5తో కియా కనేపిపై, కెనడా బ్యూటీ ఎవ్‌గెనీ బౌచర్డ్‌ 5-7, 6-4, 6-3తో డారియా గవ్రిలోవాపై గెలిచి మూడోరౌండ్లో ప్రవేశించారు. 

నడాల్‌ అలవోకగా..: స్పెయున్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ సులువుగా రెండోరౌండ్‌ను అధిగమించాడు. నడాల్‌ 6-1, 6-0, 6-3తో మెకంజీ మెక్‌డొనాల్డ్‌పై గెలవగా.. మూడోసీడ్‌, యూఎస్‌ ఓపెన్‌ విజేత డొమినిక్‌ థీమ్‌ 6-1, 6-3, 7-6 (6)తో జాక్‌ సాక్‌పై, డీగో స్వార్జ్‌మన్‌ 6-1, 7-5, 6-0తో లొరెంజోపై, వావ్రింకా 6-3, 6-2, 3-6, 6-1తో కోఫెర్‌పై నెగ్గి మూడోరౌండ్లో అడుగుపెట్టారు. ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ కూడా రెండోరౌండ్‌లో నెగ్గాడు.

Updated Date - 2020-10-01T09:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising