చెలరేగిన డికాక్.. ముంబై ఘన విజయం
ABN, First Publish Date - 2020-10-05T01:19:03+05:30
ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
షార్జా: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 209 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ మెరుగైన రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లు శుభరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలు జాగ్రత్తగా ఆడుతూ తొలి నుంచే స్పీడు పెంచారు. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగులో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో అవుటయ్యాడు. 15 బంతులు ఆడిన బెయిర్‌స్టో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. క్రీజులో కుదురుకున్న వార్నర్ జట్టు భారాన్ని తనపై వేసుకుని జాగ్రత్తగా ముందుకు నడిపించాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న మనీశ్ పాండే 94 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 19 బంతులు ఆడిన పాండే 4 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు.
అప్పటి వరకు లక్ష్య ఛేదనలో ముందుకు వెళ్తున్నట్టు కనిపించిన హైదరాబాద్ జోరు ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయింది. విలియమ్సన్ (3), ప్రియం గార్గ్ (8) అవుటయ్యాక ముంబై పట్టుబిగించింది. పరుగులు ఇవ్వకుండా జాగ్రత్తపడుతూ హైదరాబాద్‌పై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (10), అబ్దుల్ సమద్ (20) కూడా పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. చివరికి ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తాపడింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (6) విఫలమైనప్పటికీ డికాక్ అదరగొట్టాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 27, ఇషాన్ కిషన్ 31, హార్దిక్ పాండ్యా 28, పొలార్డ్ 25, కృనాల్ పాండ్యా 20 పరుగులు చేశారు. ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబైకి ఇది మూడో విజయం.
Updated Date - 2020-10-05T01:19:03+05:30 IST