ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ విరాళంతో.. స్వచ్ఛంద సంస్థకు ఊహించని రీతిలో విరాళాలు

ABN, First Publish Date - 2020-03-27T04:37:20+05:30

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణే: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజూవారీ కూలీ చేసుకొనే వాళ్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు దొరకక నానా తిప్పలు పడుతున్నారు. అయితే వీరిని ఆదుకొనేందుకు ముకుల్ అండ్ మాధవ్ అనే స్వచ్ఛంధ సంస్థ ముందుకు వచ్చింది. వీరి సహాయం చేసేందుకు విరాళాలను సేకరించడం ప్రారంభించింది. కేట్టో అనే విరాళాలు సేకరించే వెబ్‌సైట్ ద్వారా వీరు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 


పుణెలో ఇప్పటికే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలన్ని నిర్భందంలో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు దొరకక చాలా మంది ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇటువంటి వారిని ఆదుకొనేందుకే ముకుల్ అండ్ మాధవ్ అనే సంస్థ విరాళాలు సేకరించడం ప్రారంభించింది. వచ్చిన విరాళాల ద్వారా కష్టాల్లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులు, ఆహారపదార్థాలు అందించాలనేదే సంస్థ లక్ష్యం.


అయితే ఇందుకు టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన వొంతు సహాయాన్ని అందించాడు. ఇప్పటివరకూ ఆ ఫౌండేషన్‌కు ఎవరూ ఇవ్వనంత మొత్తాన్ని అతను విరాళంగా అందించాడు. రూ.లక్ష కూలీల సంక్షేమం కోసం ధోనీ విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ధోనీ సతీమణి సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకొనేందుకు ప్రతీ ఒక్కరు తమ వొంతు సహాయాన్ని అందించాలని సాక్షి కోరింది.


కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేందుకు 12 లక్షల 50 వేల రూపాయిల విరాళలు సేకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ధోనీ రూ.లక్ష విరాళంగా ఇవ్వడంతో అది చూసి చాలా మంది దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఇప్పటివరకూ దాదాపు రూ.12 లక్షలు తమకు విరాళంగా అందాయని సంస్థ తెలిపింది.

Updated Date - 2020-03-27T04:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising